గుండెపోటుతో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మృతి…
పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
కేసముద్రం/ నేటి దాత్రి
కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దురుసోజు ప్రతాపచారి గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్వగృహం వల్ల గుండె నొప్పి రావడంతో వెంటనే అకస్మాత్తుగా ప్రైవేట్ వాహనంలో మొహబత్ ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు వెంటనే గుర్తించి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు , భార్య ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. చిన్న కూతురు రమ్య కి వివాహము జరగలేదు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ హుటా హుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
