బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోచేరిన మాజీ కౌన్సిలర్స్ బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్
నేటి ధాత్రి నాగర్ కర్నూల్ జిల్లా
కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బి ఆర్ ఎస్ మాజీ కౌన్సిలర్ నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సర కాలంలో బి ఆర్ ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరముల కాలంలోని దాదాపుగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి 100 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే గారు తెలిపారు అభివృద్ధి పనుల్లో భాగంగానే ఈరోజు మాజీ కౌన్సిలర్ మోతిలాల్ ఖాజా ఖాన్ ఇసాక్ తిరుమల యాదవ్ బి ఆర్ ఎస్ టౌన్ ప్రెసిడెంట్ బాదం రమేష్ ఇమ్రాన్ హరికృష్ణ రవీంద్ర చారి అనేకమంది నాయకులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు
