*కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం*
*మేయర్ పీఠం కాంగ్రెస్ దే- వెలిచాల రాజేందర్ రావు*
కరీంనగర్, నేటిధాత్రి:
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపిలకు ప్రజలు చుక్కలు చూపించడం ఖాయమని, ఘోరంగా ఓడించబోతున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. గల్లి గల్లి లో పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ బిజెపి పార్టీ ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోరని మండిపడ్డారు. గురువారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో 28వ డివిజన్ చెందిన కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ నాయక్ నేతృత్వంలో ఆడివిజన్ కు చెందిన వంద మంది యువకులు ప్రజలు వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా రాజేందర్ రావ్ వారందరికీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని ప్రజలంతా కాంగ్రెస్ ను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బిజెపిలను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించేందుకు ప్రజలంతా కంకణం కట్టుకున్నారని కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అవినీతి అక్రమాల్లో మాత్రం మించిపోయారని ఆరోపించారు. ఎన్నికల రాగానే ప్రజలపై ప్రేమను వలకబోస్తున్నారని వారి మాటలను నమ్మవద్దని రాజేందర్రావు కోరారు. కేంద్రమంత్రి బండి సంజయ్ రెండుసార్లు ఎంపీగా గెలిచినా కరీంనగర్ అభివృద్ధిని మాత్రం మర్చిపోయారని విమర్శించారు. కరీంనగర్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని రాజేందరో పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో 28 డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ నాయక్, పులి రమేష్, పులి అనిల్, బోయిని దేవరాజు గుండేటి అనిల్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
