భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించచ్చు
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా విద్యార్థులతో ర్యాలీ.
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చునని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా డిస్ట్రిక్ట్ ట్రాన్ఫోర్ట్ ఆఫీసర్, జిల్లా రవాణా శాఖ అధికారి, శోభన్ బాబు ఆధ్వర్యంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి సాహకారంతో బుధవారం నర్సంపేట పట్టణంలోని వరంగల్ కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్డు భద్రత ఫ్లకార్డులతో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ ప్రారంభిస్తున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు
ముందుగా ఈ ర్యాలీని డిస్ట్రిక్ట్ ట్రాన్ఫోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు స్థానిక సిఐ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభం చేశారు.ఈ ర్యాలీ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు భద్రతల పట్ల అధికారులు తెలుపుతున్న అవి పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.ప్రభుత్వ భద్రత నియమాలు పాటిస్తే 90 నుండి 100 ప్రమాదాలు జరుగకుండా నివారించవచ్చునని పేర్కొన్నారు.నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని రకాల వాహనదారులకు అవగాహన కల్పించదానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

రోడ్డు భద్రత నియమాల గురించి మాట్లాడుతున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు
డిస్ట్రిక్ట్ ట్రాన్ఫోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు గాను జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని చెప్పారు.హెల్మెంట్, ధృవీకరణ పత్రాలతో వాహనాలు నడపాలన్నారు.మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ , పిసిసి సభ్యుడు పెండెం రామానంద్, మాంటిస్సొరి స్కూల్ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, మాథర్స్ ల్యాండ్ పాఠశాల ఛైర్మన్ పాశికంటి రమేష్,పలువురు అధికారులు,పోలీస్ శాఖ ఎస్సైలు,కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు పాల్గొన్నారు.
