30 మంది బిఆర్ఎస్ లో చేరిక
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారంకు చెందిన ఇతర పార్టీ నాయకులు కొల్లా స్వప్న, బుద్ది నరేష్, ముద్దమ్ శ్రవణ్ రెడ్డి, మామిడాల వెంకటేష్ గౌడ్, స్వామి లతో పాటు దాదాపు 30 మంది బిఆర్ఎస్ లో చేరారు. మాజి మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచ్ గౌస్ పాషా, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
