జాతీయ రహదారిపై ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
సింగరేణి అవినీతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి.
భూపాలపల్లి నేటిధాత్రి
బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ మైన్స్లలో పనిచేస్తున్న కార్మికులతో కలిసి సింగరేణి పరిరక్షణ కోసం కథం తొక్కడం జరిగింది.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థలో జరుగుతున్న అవినీతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణిలో కొత్త నిబంధనల పేరుతో “సైట్ విజిట్” వ్యవస్థను ప్రవేశపెట్టి, అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నారని ఆరోపించారు.

ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపి, అవినీతికి పాల్పడిన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సింగరేణి అవినీతిపై మా పార్టీ నాయకుడు హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
నిజంగా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి సంబంధాలు లేకపోతే, సీబీఐ విచారణతో పాటు సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలా చేయకపోతే కాంగ్రెస్ బీజేపీ పార్టీల అవినీతి బంధాన్ని ప్రజల ముందు బట్టబయలు చేస్తామని, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను ఎండగడతామని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట్రాణి సిద్దు మాజీ వైస్ చైర్మన్ హరిబాబు గండ్ర హరీష్ రెడ్డి బుర్ర రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
