*రిటైర్డ్ ఉద్యోగుల మనోవేదన…!!*
*పదవి విరమణ పొందిన ఉద్యోగులకు రావలసిన బకాయిలు చెల్లించండి…!*
*ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డికి వినతి పత్రం…*
*రేవా జిల్లా అధ్యక్షులు సంకా బద్రి నారాయణ*
*మహబూబాబాద్/ నేటి ధాత్రి*
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డికి పదవి విరమణ చెందిన ఉద్యోగులకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని వినతిపత్రం ఇవ్వనైనది, ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా( రేవా) జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ, పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు గుండు లక్ష్మణ్, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు వైవీ, నాగర్ కర్నూల్ జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్ర రావు, వరంగల్ జిల్లా మాజీ ప్రధాని కార్యదర్శి గఫర్ పాల్గొన్నారు, త్వరలో బకాయిలు రావటానికి కృషి చేస్తానని ఎం.ఎల్.సి శ్రీపాల్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.
