*రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన సంవత్సర 2026 క్యాలెండర్ DIEO CH.శరత్ కుమార్ ఆవిష్కరణ*
*సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)*
తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA 475 )నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ.
తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA) ఆధ్వర్యంలో నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సిరిసిల్ల లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా DIEO క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా TGJLA 475 నాయకులు DIEO గారిని శాలువాలతో సన్మానించి మర్యాదపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా DIEO మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో మన జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించడానికి మీ వంతు సహకారం అందించాలని వారు చెప్పారు .వచ్చే విద్యా సంవత్సరంలో అధికంగా ప్రవేశాలు కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని వారు కోరారు
ఈ కార్యక్రమంలో TGJLA జిల్లా నాయకులు సామల వివేకానంద్ ,దేవయ్య, కనకయ్య, చంద్రమౌళి,రాజయ్య , గజానంద,పాపారావు, రాజేశ్వరరావు, విజయ్ కుమార్, రమేష్ బాబు ,రవీందర్ ,శ్రీనివాస్,మొదలగువారు పాల్గొన్నారు.
