People Haven’t Forgotten BRS Atrocities: PCC Member
పడేండ్ల బిఆర్ఎస్ అరాచకాలు ప్రజలు మర్చిపోలేదు
పీసీసీ సభ్యులు పెండెం రామానంద్
నర్సంపేట,నేటిధాత్రి:
ఏం వ్యాపారాలు చేసి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు వివరణ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ డిమాండ్ చేశారు.
మీ..చుట్టు పక్కల ఉన్న నాయకులు చేసిన మట్టి దందాలు, భూ కబ్జాలు, గ్రీన్ ల్యాండ్ ఆక్రమణలు వంటి అనేక అక్రమాలు ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు.నైతిక విలువలులేని రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేయడం తగదని మాజీ ఎమ్మెల్యేపై ఆయన మండిపడ్డారు.నర్సంపేట పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ మా కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారని.. ఆ అభివృద్ధిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని తెలిపారు. పదేండ్లు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా సొంత ప్రయోజనాల కోసం కమిషన్ల కోసం దందాలు చేసి వందల కోట్లను సంపాదించుకున్న మీరు.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాట్లాడే నైతిక హక్కు లేదని పెద్దిని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో
పదేండ్లు మీరు చేసిన అరాచకాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదని పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్, వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, నర్సంపేట పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బల రమణారెడ్డి, మాదాసి రవి,పంబి వంశీకృష్ణ, మాజీ ఎంపిటిసి చింతల సాంబ రెడ్డి, నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన, బాణాల ప్రసన్న,శ్రీను,తదితరులు పాల్గొన్నారు.
