Youth Empowerment Through Sports: Sambasiva Reddy
యువతకు క్రీడలతోనే మానసిక ఉల్లాసం….
ఓటమి గెలుపుకు నాంది కావాలి…
జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి
మంగపేట నేటిధాత్రి
యువతకు క్రీడలతోనే మానసిక ఉల్లాసం ఉత్తేజం కలుగుతాయని నేటి ఓటమి రేపటి గెలుపుకు నాంది కావాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు శనివారం జిల్లా సరిహద్దు గ్రామాలైన మంగపేట మండలం అకినేపల్లి మల్లారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామ సర్పంచ్ కనితి సుమలత అధ్యక్షతన జరిగిన యూత్ క్రీడల విజేతల బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ యువత క్రీడా పోటీలతో పాటు విద్యా ఉపాధి రంగాల్లో రాణించాలని సేవా మార్గం అనుసరించి పేదలకు అండగా నిలవాలని అన్నారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా అకినేపల్లి మల్లారం మరియు టీ కొత్తగూడెం యూత్ సభ్యులు యువతకు క్రీడలు నిర్వహించటం మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించి యువత ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు అనంతరం క్రికెట్ షటిల్ మరియు ముగ్గుల పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో టీ కొత్తగూడెం గ్రామ సర్పంచ్ కనితి సుమలత గ్రామ రైతు పాడి ఈశ్వర్ రెడ్డి యువజన సంఘం సభ్యులు పాడి హేమంత్ రెడ్డి గాలి వేణు చిట్టిమల్ల ప్రసాద్ బోడెంపూడి శివ ప్రకాష్ గిద్ద వరుణ్ డబ్బుల ముత్యాలరావు రాట్నాల నరేష్ రెడ్డి రెండు గ్రామాల మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
