Bhupalpally Municipality Ward Reservation Process Completed
భూపాలపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను శనివారం ఐడీఓసి కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నిర్వహించారు.
ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ, 30 వార్డులకు గాను ఎస్టీ – 2, ఎస్సి – 6, బిసి – 7, అన్ రిజర్వ్డ్ – 15 స్థానాలు కేటాయించినట్లు తెలిపారు.
అలాగే ఎస్టీ వార్డుల్లో 1 మహిళకు,
ఎస్సి వార్డుల్లో 3 మహిళలకు,
బిసి కేటాయించిన 7 స్థానాల్లో 3 మహిళలకు,
అన్ రిజర్వ్డ్ 15 స్థానాల్లో 8 మహిళలకు రిజర్వేషన్లు కేటాయించినట్లు వివరించారు.
రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వీడియో గ్రఫీ మధ్య లాటరీ పద్ధతిలో నిర్వహించామని, ఈ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా సాగిందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
