Grand Muggulu Competitions Held in Kanthathmakur
ఘనంగా ముగ్గుల పోటీలు
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో ఏడో వార్డు మెంబర్ బుస్స తిరుపతి సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముగ్గుల పోటీని ఏడో వార్డ్ లో మహిళ మణుల సభ్యుల సమక్షంలో పోటీని ఘనంగా నిర్వహించారు.న్యాయ నిర్ణీతగా కంఠాత్మకూరు సర్పంచ్ కొంగంటి తిరుపతి వ్యవహరించారు.కుల పెద్ద మనుషులు యూత్,పెద్ద సంఖ్యలో వచ్చి ముగ్గులు వేసిన వారికి మద్దతుగా నిలిచి ఏడో వార్డు మొత్తం పండుగ సందడి చేశారు.ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు,అవార్డు,వాటర్ బాటిల్స్ అందించారు.సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఏడవ వార్డులో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించిన వార్డ్ మెంబరును అభినందిస్తూ, ఇలాంటి మంచి పనులు వార్డుకు చేసి మంచి పేరు తేవాలని తెలిపారు.బుస్స తిరుపతిని వార్డు ప్రజలు అభినందించారు.ఈ కార్యక్రమంలో మామిండ్ల రమేష్,జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
