భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మున్సిపాలిటీ ల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్ల విస్తరణ, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు, కమ్యూనిటీ హాల్స్ తదితర పనులు ఈ అభివృద్ధి కార్యక్రమాలలో భాగమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన భూపాలపల్లి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రజలు కూడా సహకరించి అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా పుల్లూరిరామయ్యపల్లిలో జరిగిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
