గృహ జ్యోతి పథకం: రెండేళ్లలో ప్రతి ఇంటికి లబ్ది.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం కింద వినియోగించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుంది. ఈ డబ్బును పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలతో కూడిన లేఖలను లైన్మెన్లు కిరణ్, యూనూస్ అందజేశారు.
