`జేడీ అత్యాశ..సైబర్ టోకరా!
`పేరుకు మేధావి.. ఇదేం తింగరి పని!
`సమాజ చైతన్యం.. అత్యాశ వ్యాపారం!
`సమాజాన్ని మార్చే ప్రయత్నం…నిత్యం చైతన్య ప్రవచనం.
`నూతన రాజకీయం… అత్యశ వ్యాపారం.
`సుదీర్ఘ కాలం పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం నేర్పిందేమిటి?
`జేడీ లక్ష్మీనారాయణ నేర్చుకున్నదేమిటి?
`ఆ మధ్య బెట్టింగ్ యాప్స్ మీద ప్రజల్ని చైతన్యం చేసిన జేడీ.
`సైబర్ నేరగాళ్లు ఎలా వల విసురుతారో చెప్పిన జేడీ.
`ఆయన ఎట్లా సైబర్ వలలో చిక్కారు?
`పదేళ్ల క్రితమే రిటైర్ అయిన జేడీ కి అంత డబ్బు ఎక్కడిది అని
పుట్టుకొస్తున్న ప్రశ్నలు!
`రాజకీయ పార్టీ పెట్టి తీసుకున్న విరాళాలా?
`ఎన్నికల అఫిడవిట్లో చూపించిన లెక్కలకు, పోగొట్టుకున్న సొమ్ముకు
పొంతన లేదంటున్నారు?
`డబ్బు పోయినందుకు బాధ పడాలా?
`అనవసరంగా డబ్బులు పోయిన విషయం చెప్పి విమర్శల
పాలవుతున్నారా?
`12 రోజుల్లో 19 సార్లు డబ్బులు ఎలా చెల్లించారు?
`500 శాతం ఆదాయం సమాకూరుతుందంటే ఎలా నమ్మారు?
`సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలు ఎలా నమ్మారు?
`హర్షద్ మెహతా కథ తెలియని వ్యక్తి కాదు?
`స్టాక్ మార్కెట్ గురించి తెలియని అమాయకుడా?
`అన్నీ తెలిసిన జేడీ అత్యాశ తో ఇరుక్కున్నారు?
`సామాన్యుల పరిస్థితి ఏమిటి?
జేడీ పేరు చెప్పి, సైబర్ నేరగాళ్లు ఇంకా ఎంత మందిని మోసం చేశారో?
హైదరాబాద్, నేటిధాత్రి:
దురాశ దుఖానికి చేటు. అత్యాశ కొంపకు చేటు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఏ కాలంలోనైనా ఇలాంటి వారు వుంటారని పెద్దలు ఏనాడో ఊహించి వుంటారు. అందుకే ఈ మాటలు చెప్పారు. అయితే సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మినారాయణ లాంటి వారు కూడా ఇలాంటి అత్యాశలో చిక్కుకుంటారని మాత్రం ఎవరూ అనుకోలేదు. కాని అందుకు తాను కూడా మినహయింపు కాదని నిరూపించారు. ఎందుకంటే ఆయన తన పోలీసు ఉద్యోగ నిర్వహణలో ఇలాంటి కేసులు కూడా చూసి వుంటారు. ఆయన తన విదినిర్వహణలో వున్నప్పుడు అనేకం తెలుసుకొని వుంటారు. కాని శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు ఆయన కూడా బాధితుడౌతాడని ఎవరూ అనుకోలేదు. ఆయనపై సైబర్ వల విసరడం ఏమిటి? దానిని ఆయన గమనించకపోవడమేమిటి? వాట్సాప్ కాల్స్ అన్నోన్ పర్సన్ నుంచి వస్తే లిఫ్ట్ చేయొద్దు. మాట్లాడొద్దు? అని ఇటీవల పోలీసు శాఖ హెచ్చరిస్తూనే వుంటోంది. సైబర్ నేరగాళ్లు ఏ వైపు నుంచైనా దాడి చేయొచ్చని చెబుతూనే వున్నారు. పైగా జేడి లక్ష్మి నారాయణ కూడా గత పది సంవత్సరాల కాలంగా సామాజిక హితబోధ నిత్యం చేస్తూనే వున్నారు. ఎక్కడ ఏ చిన్న క్రైమ్ అయినా, సైబర్ మోసాలు, కేసుల పరంగా వివరాలపై మీడియా పెద్దఎత్తున ఆయనను సంప్రదిస్తూనే వుంటుంది. ఆయన అన్నింటికీ సమాధానం చెబుతూనే వుంటారు. సైబర్ మోసగాళ్ల తెలివితేటల గురించి ఆయన చెబుతూనే వుంటారు. అలాంటి లక్ష్మినారాయణ ఇలాంటి కేసులో ఇరుక్కొవడం అనేది వినడానికే విడ్డూరంగా వుంది. పైగా ఒక్క రూపాయి కాదు, రెండు రూపాయలు కాదు. వేలు కాదు, లక్షలు కాదు. ఏకంగా రెండు కోట్ల యాభై ఎనమిది లక్షల రూపాయలను పోగొట్టుకున్నారంటే ఆశామాషీ వ్యవహారం కాదు. సైబర్ మోసగాళ్ల మాటలు నమ్మి, 12 రోజుల్లో 19 సార్లు లక్షలకు లక్షలు సొమ్మును బదిలీ చేశారంటే ఏ నమ్మకంతో ఆయన పంపిచారో అర్దం కాకుండా వుంది. ఇదంతా జేడి లక్ష్మినారాయణ సతీమణి పంపించిందని అంటున్నా, ఆమెకు కూడా చట్టం మీద ఎంతో కొంత అనుభవం వుంటుంది. పోలీసుశాఖ ఉన్నతాధికారి బార్య అంటే వారికి తెలియని విషయాలు కూడా వుండవు. కాని ఆమె కూడా సైబర్ వలలో చిక్కుకునేంత సులువుగా ఇతరులను ఎలా నమ్మింది అనేది ఇక్కడ బోధపడకుండా వుంది. బంగారు వస్తువులు కుదువపెట్టి మరీ డబ్బులు టాన్స్జాక్షన్ చేశారంటే చిన్న విషయం కాదు. చట్టాల మీద అవగాహన, సైబర్ నేరాల మీద పూర్తి నియంత్రణ వున్న లక్ష్మినారాయణ ఎలా అంగీకరించారు. ఆయన సతీమణి ఏకంగా లక్ష్మినారాయణ సెల్ పోన్ నెంబర్‌తోనే ఈ లావాదేవీలు నిర్వహించారంటే ఆశ్చర్యమనిపిస్తోంది. ఆయనకు తెలియకుండా జరిగింది కాదు? నేరుగా ఆయన సెల్ పోన్ నుంచే సొమ్ము బదిలీ జరుగుతుంటే ఆయన ఏం చేశారు? అంటే ఆయనకు పూర్తిగా వివరాలు తెలిసు అనేది ఇక్కడ స్పష్టమౌతోంది. నిత్యం సమాజ శ్రేయస్సు గురించి గంటలు గంటలు చర్చల్లో పాల్గొంటూ, ప్రజలను చైతన్యం చేసే లక్ష్మినారాయణ సైబర్ వలలో చిక్కడంతో ఆయనపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ఆయన నిజాయితీకి మారు పేరు అనేది అందరూ చెప్పుకునే మాట. ఆదర్శజీవితానికి నిదర్శనంగా పోలీసు శాఖలో లక్ష్మినారాయణ గురించి మీడియాలో గొప్పగా చెబుతుంటారు. ఎందుకంటే గతంలో ఎంతో సిన్సియర్ ఆపీసర్ అయితేనే ఉన్నత స్ధాయికి వెళ్లేవారని అంటుంటారు. అయినా పోలీసు శాఖలో లక్ష్మినారాయణ ఒక సింహస్వప్నం అని కూడ చెబుతుంటారు. ఆయన కూడా తన జీవితంలో ఎంత ఆదర్శంగా వున్నారో కూడా చెప్పుకుంటారు. కొన్ని విషయాల్లో సూటిగా స్పష్టంగా వుండడం నచ్చని నాయకులు తనను ట్రాన్స్పర్లు చేశారని కూడా చెప్పుకుంటారు. మహరాష్ట్రలో ఆయన చేసిన సేవల గురించి, చేధించిన కేసుల గురించి ఆయన ప్రత్యేకంగా చెబుతుంటే యువత కూడా ఆయనను ఆదర్శంగా తీసుకున్నది. పైగా ఆయన అనేక సెమినార్లలో పాల్గొని, యువతకు హిత బోధ చేస్తుంటారు. ఒక రకంగా క్లాస్‌లు తీసుకుంటారు. యువతలో చైతన్యంతోపాటు, ఆదర్శాల గురించి ఆయన అనేక సభలు, సదస్సులలో పాల్గొంటారు. అలాంటి లక్ష్మినారాయన కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారంటేనే విస్తుపోవాల్సి వస్తుంది. అది ఆయనకు తెలియకుండా జరిగింది కాదు. వారిని పూర్తిగా నమ్మిన తర్వాతే సొమ్ము బదిలీ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ సైబర్ నేరగాళ్లు కొంత కాలం నమ్మిస్తారు. నిజమే అని బలంగా నమ్మేలా చేస్తారని కూడా అంటారు. అలా వారిని నమ్మడం వల్ల పోగొట్టుకున్న విషయం చెబుతున్నారు. కాని ఎంత లాభం వచ్చిందన్న విషయాన్ని ఆయన ఎక్కడా చెప్పినట్లు లేదు. అంటే ఎంతో కొంత లాభం ముందు చూస్తేనే తర్వాత కూడా సొమ్మును బదిలీ చేసే అవకాశం వుంటుంది. ఇదిలా వుంటే ఆయనకు అంత సొమ్ము ఎక్కడిది? ఆయనకు ప్రత్యేకంగా ఎలాంటి వ్యాపారాలున్నట్లు కూడా తెలియదు. ఆయన కూడా ఎక్కడా వాటి గురించి చెప్పలేదు. సహజంగా స్టాక్ మార్కెట్లో ఎంతో అనుభవం వున్నవారైతే తప్ప పెట్టుబడులు పెట్టరు. అంతే కాకుండా ఏ పెట్టుబడిలోనూ 500శాతం లాభాలు వుండవు. స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి వల్ల నాశమైన కుటుంబాలే ఎక్కువ అని కూడా తెలియని వ్యక్తి లక్ష్మినారాయణ కాదు. అలాంటి అన్నీ తెలిసిన లక్ష్మినారాయణ పెట్టుబడి పెట్టడం ,మోసపోవడం కూడా చకచకా జరిగిపోయింది. కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే ఇదంతా ఓ మాయలాగా జరిగిపోయింది. అయితే ఆయనకు అంత సొమ్ము ఎక్కడిది? ఆయన రిటైర్ అయి కూడా సుమారు పది సంవత్సరాలు దాటిపోయినట్లుంది. పెన్షన్ తప్ప మరో ఆదాయం వున్నట్లు కూడా లేదు. ఉద్యోగ విరమణ సమయంలో కూడా ఇంత పెద్ద మొత్తం కూడా రాదు. నిజం చెప్పాలంటే ఇలాంటి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పోతే పోని అనుకుంటే తప్ప ధైర్యం చేయరు. అటువంటప్పుడు రెండుకోట్ల యాభై ఎనమిది లక్షలు పెట్టాలంటే ముందు ధైర్యం కావాలి. లేకుంటే పోతే పోయిందిలే అనుకొని అయినా పెట్టుబడి పెట్టాలి. తాము మోసపోయామని తెలుసుకోవడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే స్టాక్ మార్కెట్లో నష్టపోతే ఈ విషయం బైటకు పొక్కేది కాదు. వాళ్లు చెప్పేవారు కాదు. ఉత్త పుణ్యానికి అంత సొమ్ము పోగొట్టుకున్నామని, సైబర్ నేరగాళ్ల బారిన పడ్డామని తెలిసి బైటకు వచ్చారు. దాంతో వారికి వారుగానే అనేక అనుమానాలు ప్రజలకు కలిగేలా చేశారు. ఇప్పుడు ఆయన రిటైర్డ్ పోలీస్ అదికారి మాత్రమే కాదు, రాజకీయ నాయకుడు కూడా..! ఆయన గతంలో జనసేన పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక సొంతంగా రాజకీయ పార్టీనే ఏర్పాటు చేశారు. ఆ పార్టీని కూడా ఆయన రద్దు చేసినట్లున్నారు. అంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు వచ్చిన విరాళాలా? లేక ఉద్యోగ నిర్వహణలో వున్నప్పుడు సంపాదించిన సొమ్మా? అనే అనుమానం ఆయనే కల్పించారు. ఎందుకంటే ఆయన ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో చూపిన లెక్కలకు, స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి లెక్కలకు పొంతన లేదు. బంగారాన్ని తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు తెచ్చి పెట్టారంటే, వాటి అసలు ఖరీదు ఎంతుంటో అర్దం చేసుకోవచ్చు? పైగా ఒక బ్యాంకు కూడా కోట్లాది రూపాయలు బంగారం కుదువ పెట్టుకుంటే ఇచ్చే అవకాశం లేదు. అలా బంగారాన్ని కుదువపెట్టి, ఏ ఏ ఫైనాన్స్ సంస్థల నుంచి సొమ్ము తెచ్చారన్నది కూడా లెక్క చెపాల్సిన పరిస్ధితి వుంటుంది. ఈ విషయంలో ఎవరు కోర్టుకు వెళ్లినా దీని మీద దర్యాప్తు చేసే అవకాశం వుంది. ఎన్నికల సంఘానికి ఉత్తరం రాసినా పరిస్దితి మరో రకంగా వుంటుంది. తనకు తానుగా అత్యాశకు పోయి అన్ని దారులు మూసుకునేలా చేశారా? తెలిసి చేసినా తెలియక చేసినా ఇది కూడా నేరమే అవుతుందా? లేక బాదితుడే అవుతారా అన్నది కూడా తెలియాల్సి వుంది. ఆ మధ్య బెట్టింగ్ యాప్‌ల వలలో పడొద్దు. కేసుల పాలు కావొద్దు. అంటూ అనేక నీతులు చెప్పారు. అందుకు సహకిరంచిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని చెప్పారు. మరి ఇప్పుడు జేడి లక్ష్మినారాయణ పేరు చెప్పి ఆ సైబర్ నేరగాళ్లు ఎంత మంది సొమ్ముకు కన్నంపెట్టారన్నది తెలిసే అసలు గుట్టంతా బైటకు వస్తుంది.
