Nokia Phones Ordered in 2010 Delivered in 2026
010లో నోకియా ఫోన్లు ఆర్డర్ పెడితే 2026లో డెలివరీ..
ఓ ఫోన్ షోరూం యజమాని 2010లో పెద్ద మొత్తంలో నోకియా మొబైల్ ఫోన్లు ఆర్డర్ చేశాడు. అయితే, డెలివరీ ఆలస్యమైంది. అది మామూలు ఆలస్యం కాదు. ఫోన్లు డెలివరీ అవ్వటానికి ఏకంగా 16 సంవత్సరాలు పట్టింది..
15 ఏళ్ల క్రితం నోకియా ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఏ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చినా.. ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. కోటీశ్వరుల దగ్గరి నుంచి సాధారణ మధ్య తరగతి వరకు అన్ని వర్గాల్లో నోకియాకు మంచి డిమాండ్ ఉండేది. 2007 నుంచి మెల్ల మెల్లగా నోకియా కంపెనీ పతనం మొదలైంది. యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకం పెరిగిపోయిన తర్వాత నోకియా ఫోన్లకు డిమాండ్ తగ్గిపోయింది. సింబియాన్ ఓఎస్ నుంచి అప్డేట్ కాకపోవటం వల్ల నోకియా కంపెనీ పూర్తి స్థాయిలో పతనం అయిపోయింది. భారీ షేర్ లాస్ కారణంగా నొకియా కంపెనీ 2013లో ఫోన్ బిజినెస్‌ను మైక్రోసాఫ్ట్ కంపెనీకి అమ్మేసింది.
