Illegal Construction Must Be Removed: Revenue Officials
అక్రమ నిర్మాణం అపవల్సిందే…..!
◆:- నోటీసు జారిచేసిన రెవిన్యూ సిబ్బంది
◆:- ఇదివరకే నోటీసు జారిచేసిన గ్రామ పంచాయతీ అధికారులు
◆:- అయిన పట్టించుకోని వైనం
◆:- చివరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను తప్పుదోవ పట్టించిన ఇల్లు నిర్మానితులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం సజ్జపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూమికి సంబందించిన 21సర్వనంబర్ లో బ్యాగరి రాములు ఇల్లు అక్రమ నిర్మాణం చేపట్టడంతో గత 15రోజుల క్రితం పంచాయతీ అధికారులు నోటీసులు జారిచేసి అక్రమ కట్టడాన్ని జేసీబీతో కూల్చివేయడం జరిగింది.అనంతరం కోహిర్ మండల రెవిన్యూ అధికారులు స్థానిక తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకొని 21సర్వే నంబర్ భూమి ప్రభుత్వ పరిధిలోనిది అని ఈ సర్వే నంబర్ లో ప్రభుత్వం పల్లె ప్రకృతి వనంకు కేటాయించిందని మండల సంబంధిత అధికారులు తెలియజేశారు.
ఈ విషమై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విచారణ చేపట్టి సజ్జపూర్ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి వెళ్లిన అనంతరం మల్లి మంగళవారం సజ్జపూర్ గ్రామనికి వచ్చి బాధిత కుటుంబానికి 25వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి పల్లె ప్రకృతి వనంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణానికి భూమి పూజ చేసి వెళ్లి పోవడం జరిగింది. ఇదిలా ఉండగా బుధవారం ప్రభుత్వ భూమి అయిన పల్లె ప్రకృతి వనంలో మల్లి అక్రమ నిర్మాణం చేపట్టడంతో స్థానిక రెవిన్యూ అధికారులు నోటీసులు జారిచేసి నిర్మాణాన్ని ఆపేయవలసిందిగా నిర్మస్తున్న వారిని ఆదేశించారు.

ఇది ప్రభుత్వ భూమి అని అన్ని రికార్డుల్లో తెలిసిన తర్వాత కూడ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సైతం తప్పుదోవ పట్టించడం ఏంటని ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడవల్సింది పోయి అగ్రమనకు గురవుతున్న చోద్యం చూస్తూ ఇష్టనుసారంగా వ్యవహరించడం సరైంది కాదని రెవిన్యూ అధికారులు అంటున్నారు. గ్రామంలోని 21సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో ఎవరైన సరే అగ్రమంగా ఇండ్ల నిర్మాణం షెడ్ ల నిర్మాణం చేపడితే ప్రభుత్వ పరంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.
