Demand for New Building for Narsampet Junior College
నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మించాలి
శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల
ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ వినతిపత్రం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని కోరుతూ ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ వినతిపత్రం అందజేశారు.ఆ శాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జన్నూ రమేష్, చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థలో ఉన్నదని అవేదన వ్యక్తం చేశారు.ఆ స్థానంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.అలాగే 2018లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలన్నారు.సాంఘిక సంక్షేమ వసతి గృహాలు గురుకుల పాఠశాలలు అద్దె భవనంలో నడుస్తున్నాయని వాటికి సొంత భవనాలు నిర్మించాలని వివరించారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ప్రత్యేకంగా మహిళలకు హాస్టల్ నిర్మించి వసతి కల్పించాలని వారు కోరారు. లేనియెడల ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెనీష్, నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు.
