CM Relief Fund a Boon for the Poor: Totakura Vajresh Yadav
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం : తోటకూర వజ్రెష్ యాదవ్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 5 :
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు.
ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ సర్కిల్ల పరిధిలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన నివాసంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన పేదలకు చేరాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనారోగ్యం, ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఊరటనిస్తోందని పేర్కొన్నారు. బోడుప్పల్ జిహెచ్ఎంసి సర్కిల్ రామ్ లాల్ నాయక్ కు రూ. 33000, నాగారంకు చెందిన హేమంత్ కు రూ. 60.000, ఘట్కేసర్ సూర్య దేవి రూ. 55,000, పూస నరేందర్ రూ. 33,500, మహమ్మద్ ఖాన్ రూ. 60,000, పాపుల నరసింహ రూ. 38,500, బోడుప్పల్ సర్కిల్ దేవేందర్ నగర్ సమ్మక్క రూ. 60,000, పీరజాదిగూడ
రోహిత్ రూ. 60,000, రాగిరే విజయ్ కుమార్ రూ. 60,000, బోడుప్పల్ సోమనారాయణ రూ. 32,000, శామీర్ పేట్ కన్నబోయిన వసంత రూ. 35,000, మంజుల రూ. 31,500, మూడు చింతలపల్లి సింఘం సక్కుబాయి రూ. 60,000, ఆరోని రూ. 60,000 చెక్కులు అందజేశారు.
