Village Development Key Role of Sarpanch: SC ST Chairman
గ్రామాలను అభివృద్ధి చేయాలి..మానవులంతా సమానమే..
ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య..
నిజాంపేట: నేటి ధాత్రి
గ్రామంలో సర్పంచ్ ల పాత్ర కీలకమని గ్రామ అభివృద్ధి ధ్యేయంగా సర్పంచ్ లు పనిచేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. రామాయంపేట, నిజాంపేట మండలలో ఎస్సీ, ఎస్టీ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. గ్రామానికి సర్పంచ్ వెన్నుముక లాంటి వాడని, గ్రామ అభివృద్ధి సర్పంచ్ చేతిలోనే ఉంటుందన్నారు. భారతదేశంలో మానవులంతా సమానమేనని ప్రతి ఒక్కరు రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా అందరు సమానమేనన్నారు. భారతదేశ మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే బాటలో నడవాలన్నారు. స్థానిక ఎస్సై రాజేష్, డీఎస్డీఓ సింధు, డీబీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ తదితరులు ఉన్నారు.
