TASKA Siricilla Launches 2026 Diary and Call Letter
రాజన్నసిరిసిల్ల జిల్లా ( టాస్కా ) శాఖ డైరీ పిలుపు పత్రిక ఆవిష్కరణ
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని (టాస్కా) సిరిసిల్ల శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన కోడం నారాయణ కార్యనిర్వహణలో ,రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య సూచనలతో కోశాధికారి దొంత దేవదాసు వ్యాఖ్యానంతో ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో సిరిసిల్ల ఆర్డిఓ వేంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డిఓ శ్రీమతి రాదా బాయి మేడం , జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజమ్ ,2026 డైరీ, పిలుపు పత్రికను ఆవిష్కరించి సిరిసిల్ల జిల్లాలో సీనియర్ సిటి జనులు ఐక్యంగా సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగు తున్నా రని అభినందించారు. ఉపాధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ గొంతుక పిలుపు పత్రిక అన్నారు. వివిధ జిల్లాల్లో జరుగుతున్న చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ పత్రిక ఎలుగెత్తి చాటు తుందన్నారు. వయసులో పెద్ద వారైనా మానసికంగా ఆనందంతో నవ యువకులు గా కార్యక్రమానికి సన్నద్ధు లై ముందుకు సాగుతుందన్నారు. డైరీ కూడా అందంగా చక్కని అంశాలతో కూడి ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, శ్రీ గాద మైసయ్య, కార్యదర్శులు అoకారపు జ్ఞానోబా, గౌరిశెట్టి ఆనందం, ప్రచార కార్యదర్శి గజ వాడ కైలాసం, గుడ్ల శ్రీధర్, గజ్జల్లి రామచంద్రం, శ్రీహరి రెడ్డి, కే తిరుపతి రెడ్డి, ఎండి పాషా, ఇరుకుల్ల భాస్కర్, మొదలైన వారు పాల్గొన్నారు.
