Trident Sugar Factory Workers Protest for Justice
ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ కార్మికుల ఆందోళన: న్యాయం జరిగే వరకు పోరాటం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామ శివారులోని ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ కార్మికులు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. శుక్రవారం రెండవ రోజు పరిశ్రమ గేటు ముందు ఆందోళన చేపట్టి, యాజమాన్యం మొండి వైఖరిని వీడాలని నినాదాలు చేశారు. పర్మనెంట్ కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా వలస కార్మికులతో పనులు చేయించుకోవడంపై మండిపడ్డారు. బకాయిలు చెల్లించకుండా కాలక్షేపం చేస్తున్నారని, న్యాయం చేయకుండా పనులు కొనసాగిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. సంబంధిత అధికారులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరారు.
