"Police Issue Strict Guidelines for New Year Celebrations"
నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలి
వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే ఉపేక్షించం – ఎస్సై దీకొండ రమేష్
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలంలో నూతన సంవత్సర వేడుకలు శాంతి భద్రతలు భంగం కలగకుండా ఉండేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు ప్రజ జీవనానికి భంగం కలిగించే విదంగా ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని డీజే లు నిషేధం, వినియోగిస్తే సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని,మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం, వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతోపాటు జైలు శిక్ష విధించబడుతుంది.ఇల్లు, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాల పై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టిన, అసభ్యంగా ప్రవర్తించిన,ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టినా, మీ న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో క్లోజ్ చేయాలి, మైనర్లకు మద్యం అమ్మకూడదు.బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు పెడుతామని,మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే వారి సంరక్షకుల పైన కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. ఎవరైన ఈ నియమాలను అతిక్రమించిన, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 నంబర్‌కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీస్ శాఖ కు మండల ప్రజలు సహకరించాలని కోరారు.2026 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ, మండల ప్రజలకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని పోత్కపల్లి పోలీస్ పోలీసు విజ్ఞప్తి చేస్తోంది. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి, నిరంతర పెట్రోలింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఎక్కడా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
