ఘనంగా జరుపుకున్న క్రిస్మస్ వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ శాసన పరిధిలోని ఝరాసంగం మండల కేంద్ర గ్రామంలో గురువారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని చర్చి వద్ద నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ శాలువా పూలమాలలతో సన్మానించి కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరీ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు కీర్తనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చర్చిలో ఉన్న ప్రార్థన మత గురువు నాగన్న పటేల్,సంగ్రామ్, కొన్నిటి సంగప్ప ఆనంద్, రవి కుమార్,సాగర్, సంగమేష్, రమేష్, చింటూ తదితరులు పాల్గొన్నారు
