"Officials Inspect Dangerous Border Bridge, Heavy Vehicles Restricted"
— సరిహద్దు బ్రిడ్జ్ నీ పరిశీలించిన అధికారులు
• భారీ వాహనాలు వెళ్లొద్దు..
నిజాంపేట: నేటి ధాత్రి
సరిహద్దు గ్రామాలకు వెళ్లే రోడ్డులో బ్రిడ్జ్ ప్రమాదకరంగా ఉంది. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామం నుండి కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ఇస్సా నగర్ వెళ్ళే రోడ్డులో గల బ్రిడ్జ్ గత కొన్ని నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ప్రమాదకరంగా తయారైంది. దీంతో పంచాయతీ రాజ్ ఏఈ శరత్ కుమార్, బ్రిడ్జిని పరిశీలించారు. అలాగే గ్రామంలోని 1 వార్డులో నెలకొన్న మురికి కాలువ సమస్యను అధికారులకు తెలిపారు. నిర్మాణం లో ఉన్న గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరిహద్దు బ్రిడ్జి ప్రమాదం లో ఉన్నందున భారీ వాహనాలు వెళ్ళవద్దని సూచించారు. సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుపోతామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పాతూరి భాను ప్రసాద్ రెడ్డి, కార్యదర్శి భాగ్యలక్ష్మి, పాతూరి బాల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, ఉప సర్పంచ్ మ్యాదరి కుమార్, ఉడేపు కృష్ణ, వడ్ల యాదగిరి ఉన్నారు.
