Speeding Overloaded Sand Lorries Stopped
అతివేగంతో దూసుకెళ్తున్న ఇసుక లారీలు
డ్రైవర్లను హెచ్చరించిన స్థానికులు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని వేలాల గోదావరి పరివాహక ప్రాంతం ఇసుక క్వారీ నుండి ఓవర్ లోడ్ తో వస్తున్న ఇసుక లారీలను గురువారం కుందారం స్థానిక హమాలీ సంఘం నాయకులు అడ్డుకున్నారు.ఓవర్ లోడ్ తో పాటు అతివేగంగా నడుపుతున్న లారీ డ్రైవర్లను నెమ్మదిగా వెళ్లాలని హెచ్చరించారు.ఈ సందర్భంగా హమాలి సంఘం నాయకుడు ముదాం రమేష్ మాట్లాడుతూ ఓవర్ లోడ్ తో ఇసుక నింపుకొని లారీల్లో తరలిస్తున్నారని తెలిపారు.దీంతో రహదారులన్నీ ధ్వంసం అవుతున్నాయని ఆరోపించారు.గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల కోసం తరలించే మట్టి లారీలతో పాటు ఇసుక లారీల రాకపోకల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.దీనికి తోడు విపరీతమైన దుమ్ము, ధూళి లేస్తూ ఇళ్లలోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మద్యం సేవించి,డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ, రహదారుల పక్కన పార్కింగ్ చేస్తూ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.వెంటనే సంబంధిత అధికారులు స్పందించి లారీలు తమ గ్రామం గుండా వెళ్లేటప్పుడు నెమ్మదిగా వెళ్లే చర్యలు తీసుకోవాలని కోరారు.
