Gitanjali Students Explore Agricultural Crops
వ్యవసాయ పంటలను పరిశీలించిన గీతాంజలి విద్యార్థులు
ఉత్సాహంగా పంట చేళల్లో తిరిగిన విద్యార్థులు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని గీతాంజలి ప్రైమరీ పాఠశాల విద్యార్థులు శనివారం వ్యవసాయ పంటలను పరిశీలించారు.డిసెంబర్ 23 న ప్రపంచ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని గీతాంజలి ప్రైమరీ పాఠశాల విద్యార్థులు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట,నాగుర్లపల్లి గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.ఈసందర్భంగా కూరగాయల పంటలను,మిర్చి తదితర పంటలను విద్యార్థులు పరిశీలించి వాటియొక్క సాగు చేసే విదానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.క్షేత్రస్థాయిలో పంటల పరిశీలనకు వెళ్లిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పంటచేనులో కలియ తిరిగారు.గ్రామం నుంచి ఎడ్ల బండ్లపై ప్రయాణం చేసి, పంటచేను వద్ద ట్రాక్టర్ పై విద్యార్థులు కూర్చోని ఆనందంగా గడిపారు.

ఈసందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నారుల వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. ఈ సందర్భంగా గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ డిసెంబర్ 23 న రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా విద్యార్థులకు వ్యవసాయ పంటల పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు, రైతుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ మిధున్, గుడిపాటి సౌజన్య, ఫీల్డ్ విజిట్ ఇంచార్జిలు ఆస్య , నూకల నాగ లక్షీ , ఉపాధ్యాయిని లు కుండె అనిత, శ్రీలక్ష్మీ, కావ్య,యాంకి , దేవిక, రాధిక పాల్గొన్నారు.
