Teacher Distributes ID Cards to Students
విద్యార్థులకు ఐడి కార్డ్స్,బెల్టుల పంపిణీ
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట ప్రభుత్వ ఎంపీ యుపిఎస్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కోడెం సాంబయ్య తన పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులకు ఉచితంగా ఐడి కార్డ్స్, బెల్టులను పంపిణీ చేశారు.ముఖ్యఅతిథిగా హాజరైన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వీణ మాట్లాడుతూ ఉపాధ్యాయుడు సాంబయ్య తన జన్మదినం సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు ఐడి కార్డులు,బెల్ట్ అందించడం అభినందినీమన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, కొర్ర రమేష్,మనస్విని,మహమ్మద్ వహీదా తదితరులు పాల్గొన్నారు.
