Focus on Village Development: MLA Koninty Manik Rao
గ్రామాభివృద్ధిపై దృష్టి సారించాలి…!
◆:- … వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే
◆:- … ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం, పంచాయతీ ఎన్నికలలో బి ఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులు గ్రామాభివృద్ధిపై దృష్టి సారించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అన్నారు. మండలంలో బి ఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాం కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చేది మన ప్రభుత్వమేనని ఇందుకు నిదర్శనం ఈ పంచాయతీ ఎన్నికలేనని ఎమ్మెల్యే అన్నారు.

33 గ్రామపంచాయతీలో గాను 15 గ్రామపంచాయతీ బి ఆర్ఎస్ గెలవడం సంతోషమన్నారు. ఝరాసంగం మండల కేంద్రంలో ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో ప్రజలు బి ఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ రాయికోటి వినోద, ఉప సర్పంచ్ గడ్డం మమతలతో పాటు వార్డు సభ్యులను సన్మానించారు. అందరూ సమిష్టిగా ఉండి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఝరాసంగం మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, మాజీ ఎంపీపీ అధ్యక్షులు సంగీత సంగమేశ్వర్, మాజీ ఎంపీటీసీ రజిని ప్రియా సంతోష్ పాటిల్, నాయకులు ఏజాజ్ బాబా, శ్రీనివాస్ పటేల్, నాగన్న పటేల్, నాగన్న సజ్జన్ శెట్టి, ఉల్లాస్, సామెల్, సద్దాం, కేదార్ చౌతాయి తదితరులు పాల్గొన్నారు.
