BRS Leaders Join Congress in Lakshmareddy Palli
లక్ష్మారెడ్డి పల్లిలో బీఆర్ఎస్ నుండి కాంగ్రేస్ లో చేరికలు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు మెంబర్లు జన్నె శరత్ బాబు మొగిలి అంజమ్మ సదయ్య ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.
చేరిన వారిలో యూత్ నాయకులు గాదె ఓదెలు జన్నె నరేష్ జన్నె సుబుద్ధి జన్నె సుమంత్ పెండెల రాజు తదితరులు చేరారు.
ఇట్టి కార్యక్రమంలో లక్ష్మారెడ్డి పల్లి కాంగ్రెస్ పార్టీ నూతనంగా గెలుపొందిన సర్పంచ్ వీరమల్ల సంపత్ రెడ్డి ఉప సర్పంచ్ మొగిలి శంకర్ ఎడ్ల ప్రియాంక సన్మానించి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
