Swaroop Srinivas Seeks Chance to Serve Seetharampur
ఒక్క అవకాశం ఇస్తే గ్రామానికి సేవ చేస్తా
* సీతారాంపూర్ సర్పంచ్ అభ్యర్థి డప్పు స్వరూప శ్రీనివాస్
* గ్రామానికి గ్రంధాలయం ఏర్పాటు చేస్తాను
* గ్రామంలో యువతకు,మహిళాలకు ఉపాధికి కృషి చేస్తా
చేవెళ్ల,నేటిధాత్రి :
అవకాశం ఇస్తే సర్పంచిగా గ్రామానికి సేవ చేస్తా,గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని సీతారాంపుర్ గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి డప్పు స్వరూప శ్రీనివాస్ గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి గ్రామప్రజల మద్దతుతో ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. గ్రామప్రజలు తనను సర్పంచిగా ఆశీర్వదిస్తే గ్రామంలో గ్రంధాలయం ఏర్పాటు, యువతకు, మహిళలకు ఉపాధి కల్పించే విదంగా కృషి చేస్తానని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు కోల్పోయిన వారికీ ప్రభుత్వం కేటించిన ఇంటి స్థలాలు ఇప్పటివరకు గ్రామంలో ఎవ్వరికి ఇవ్వలేదు. నేను సర్పంచిగా ఎన్నికైన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి మీలో ఒకరిగా ఉండి భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ప్లాట్స్ వచ్చే విదంగా కృషి చేస్తానని తెలిపారు.
* గతంలో సర్పంచిగా డప్పు వారి కుటుంబం :
గతంలో డప్పు వారి కుటుంబం సర్పంచిగా గ్రామ అభివృద్ధికి, గ్రామానికి సేవ చేశారని,ఇప్పుడు గ్రామప్రజలు తనకు సేవచేసే అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మీడియతో మాట్లాడుతూ గతంలో తనకుటుంబం సర్పంచిగా గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, మరుగుదొడ్లు వంటి ప్రభుత్వ అభివృద్ధి పనులు చేశారని, పేదప్రజలకు పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి సహాయాసహకారాలు అందించడం జరిందని తెలిపారు. సర్పంచిగా ఎన్నికైన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని తెలిపారు. గ్రామ ప్రజల మద్దతు తనకే ఉందని ఖచ్చితంగా సర్పంచిగా గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు.
