Weekly Train from Tirupati to Shirdi Launched
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి వీక్లీ రైలు..
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి వీక్లీ రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఈ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య వీక్లీ రైలు ఏర్పాటుచేయడం వల్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరైలు మంగళవారం నుంచి ప్రారంభమైంది.
తిరుపతి: తిరుపతి, సాయినగర్ షిర్డీ.. ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య అనుసంధానం పెరిగేలా, భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలును ప్రారంభించారు. ఢిల్లీ నుంచి మంగళవారం కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి.సోమన్న వర్చువల్గా ప్రారంభించగా, తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. అదే సమయంలో తిరుపతిలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీటీడీ సభ్యుడు జి.భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ
