వైభవంగా అయ్యప్పస్వామి పల్లీవేట కార్యక్రమం
పల్లివేట దాతగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమ్రోగిన నర్సంపేట
కార్యక్రమం నిర్వహణ శబరిమలై దేవాలయ మేల్ శాంతి,తాంత్రికవేత్త శంకరన్ నంబూద్రి
నర్సంపేట, నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం సిల్వర్ జూబ్లీ మండల పూజల మహోత్సవాల్లో భాగంగా సోమవారం అయ్యప్ప స్వామి పల్లి వేట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పల్లివేట,మహా అన్నదానదాతగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వ్యవహరించగా అయ్యప్ప స్వామి సర్వ సైన్యాధ్యక్షునిగా రాణా ప్రతాప్ రెడ్డి శిష్యుడు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ వ్యవహరించారు. నర్సంపేట శ్రీ ధర్మశాస్త అయ్యప్పదేవాలయ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగరికొండ మాధవ శంకర్, అధ్యక్షులు సైఫా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా

ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పల్లివేట కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమ నిర్వహణ శబరిమలై దేవాలయ మేల్ శాంతి,తాంత్రికవేత్త శ్రీమాన్ బ్రహ్మశ్రీ, శంకరన్ నంబూద్రి, హైదరాబాద్ మహా శాస్త్ర సేవ సంఘం ట్రస్ట్ బాధ్యులు,గురుస్వామి డాక్టర్ సుధగాని రాజుగౌడ్, నర్సంపేట దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా వేదమంత్రాలతో చేశారు. ముందుగా దేవా ట్రస్టు ఆధ్వర్యంలో గణపతి హోమం తోపాటు పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు.ముఖ్య అతిథిగా జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం రాణా ప్రతాప్ రెడ్డి అనుచరుడు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తలపై ఎత్తుకొని అలంకరణ చేసిన ఊరేగింపు ప్రత్యేక వాహనాల్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా శబరిమలై నుండి హాజరైన వాయిద్య కళాకారులు, మనిషి వివిధ వేషాదారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయ్యప్పస్వామి ఊరేగింపుగా పట్టణంలోని మున్సిపాలిటీ ఆదరణ పార్క్ వద్ద పూంగివనంలో తాంత్రిక వేత్త మేల్ శాంతి శంకరన్ నంబూత్రి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి పల్లివేటలో భాగంగా మున్సిపాలిటీ ప్రాంగణం ఏర్పాటుచేసిన ప్రత్యేక సెట్టులో అచ్చ దయాకర్ అయ్యప్ప విగ్రహాన్ని తలపై ఎత్తుకొని వేటకు వెళ్లే విధానాన్ని ప్రదర్శించారు.నర్సంపేట పట్టణంలో ఎక్కడ చూసినా కాషాయ జెండాలే ఆగుపడ్డాయి.ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాలదారులు భక్తులు చేపట్టిన అయ్యప్పస్వామి శరణు ఘోషతో పట్టణం మారుమ్రోగింది.

డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం ప్రజలు రైతులు అన్ని వర్గాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. ధర్మాన్ని కాపాడడం వల్ల అదే ధర్మం మనల్ని కాపాడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ కాట భాస్కర్, పలువురు అధికారులు,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహ రాములు , జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ ,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి,రాష్ట్ర ఓబిసి మోర్చ అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు,ములుగు జిల్లా నాయకులు కృష్ణవేణి,మండలాల అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్ మెంబర్స్,ప్రధాన కార్యదర్శులు,ఉపాధ్యక్షులు, యువ మోర్చ జిల్లా,నియోజకవర్గ నాయకులు , దేవాలయ గురు స్వాములు,ట్రస్ట్ సభ్యులు, అయ్యప్ప మాలదారులు, భక్తులు, పాల్గొన్నారు.
