Tulsi Remedy for Shani Problems
శని వెంటాడుతుందా.. తులసి మొక్క వద్ద ఈ వస్తువును పాతిపెట్టండి.. !
ఈ ఒక్క వస్తువును తులసి మొక్క వద్ద పాతిపెట్టడం వల్ల జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఈ పరిహారం శని ప్రభావాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.
హిందూ శాస్త్రంలో తులసి మొక్కను దేవతగా పూజించే సంప్రదాయం ఉంది. తులసిని ఇంటికి సానుకూలతను తెచ్చే మొక్కగా పరిగణిస్తారు. తులసి మొక్క ఉన్న ఇళ్లలో సంపద, శ్రేయస్సు ఉంటుందని కూడా నమ్ముతారు. ఎందుకంటే లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుందని నమ్ముతారు. అయితే, మీ జీవితంలో ఆర్థిక, మానసిక లేదా కుటుంబ సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి! ఈ ఒక్క వస్తువును తులసి మొక్క వద్ద పాతిపెట్టడం వల్ల జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిషం, వాస్తు శాస్త్రం ప్రకారం.. తులసి మొక్క వద్ద రూపాయి నాణెంను పాతిపెట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. శని, రాహువు ప్రభావాన్ని తగ్గిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య తరచుగా గొడవలు ఉంటే, తులసి మొక్క నేలలో ఒక రూపాయి నాణెంను పాతిపెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. తులసిని సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల, తులసి మొక్క వద్ద ఒక నాణెంను పాతిపెట్టడం వల్ల కుటుంబ కలహాలు తగ్గుతాయి. ఇంట్లో శాంతి లభిస్తుంది. కుటుంబంలో అకాల మరణాలు నివారిస్తుంది.తులసికి సంబంధించిన ఏదైనా పరిహారాన్ని స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించిన తర్వాత మాత్రమే చేయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గురువారం లేదా శుక్రవారం తులసి మొక్క వద్ద నాణెం పూడ్చిపెట్టడం మంచిది. తులసి మొక్క వద్ద రూపాయి నాణెం పూడ్చిపెట్టి ప్రతిరోజూ క్రమం తప్పకుండా తులసిని పూజించాలి. నెయ్యి లేదా నూనె దీపం వెలిగించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది.
