New Booklet Exam System Introduced
ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్లెట్
విద్యా శాఖ ఓ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ఎలా అమలవుతుందన్న దానిపై ఓ ప్రత్యేక కథనం.
ప్రభుత్వ పాఠశాలల్లో(Govt Schools) చదివే విద్యార్థులు పరీక్షలు రాసేందుకు బుక్లెట్ అందిస్తున్నారు. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ప్రతి విద్యార్థి ప్రగతిని బట్టే ఉపాధ్యాయులు అవగాహన చేసుకునే వీలు ఏర్పడుతుంది. పరీక్షల మార్కులను ఆన్లైన్లో చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యారంగంలో వస్తున్న సంస్కర ణలో భాగంగా ఇప్పటికే పాఠ్యపుస్తకాలను సమూలంగా మార్పుచేశారు.
సెమిస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యాసంవత్సరంలో ఫార్మటివ్ అసెస్మెంట్ (యూనిట్) పరీక్షలు 4 జరుగుతాయి. క్వాటర్లీ, హాఫియర్లీ, ఫైనల్ ఎగ్జామ్ స్థానంలో సమ్మెటివ్ అసెస్మెంట్ 1, 2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. కొత్త విధానంలో మొదటి, రెండోవ సెమిస్టర్లలో రెండు ఫార్మటివ్, ఒక సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు వంతున జరుగుతాయి. ఇప్పటికే రెండు ఫార్మటివ్ పరీక్షలు ముగియగా ప్రస్తుతం సమ్మెటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు జరుగుతున్నాయి.
