Two Killed in Kalikiri Train Accident
రైలు ఢీకొని ఇద్దరు మృతి
అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. రైలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పట్టాలపై కూర్చొని మద్యం సేవిస్తుండగా.. రైలు ఢీ కొట్టింది.
జిల్లాలో ఘోరం జరిగింది. రైలు ఢీకొని(Train Accident) ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన కలికిరి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. కలికిరి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌పై ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తుండగా.. స్టేషన్ సిబ్బంది వారించారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు కాసేపు స్టేషన్ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. తర్వాత రైల్వే స్టేషన్ సమీపంలోనే పట్టాలపై కూర్చొని మద్యం సేవించారు. అదే సమయంలో ఎక్స్ ప్రెస్ రైలు(Express Train Hits Two,) వచ్చి.. వారిద్దరిని ఢీ కొట్టింది.
