Lakshminarasimha Brahmotsavam Begins
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ నమిలికొండరమణాచారి స్వామి వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభంచేయడo జరిగిందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇట్టి బ్రహ్మోత్సవాలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈనెల 03. 12.2025. బుధవారం నాడు విశ్వక్సేనపూజ పుణ్యాహ వాచనము.రక్షబంధనము. అంకురార్పణ. దీక్ష స్వీకరణ. వైన తీయ ప్రతిష్ట. యాగశాల ప్రవేశం. ద్వార తోరణం. ధ్వజ కుంభ ఆరాధన. అఖండ దీప స్థాపన. చతుస్థానార్చన. మూర్తికుంభారాధన అగ్ని ప్రతిష్ట. మూల మంత్ర హవనం. ధ్వజారోహణం. నిత్య పూర్ణాహుతి. తీర్థ ప్రసాద వితరణ. జరుగుతుందని అలాగే సాయంత్రం 6:30 నిమిషములకుశ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. యోగశాలల ఆరాధనలు. నిత్యాహవనాలుమూర్తి మంత్ర. మాల మంత్ర హ వనములుబేరీపూజదేవత ఆహ్వానం. బలి హరణం. నిత్య పూర్ణాహుతి తీర్థ ప్రసాదం వితరణ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ప్రజలందరూ దుష్ట శిక్షణ శిక్ష రక్షణ. గా. ఎన్నో సంవత్సరాలుగా స్వయంభు లక్ష్మీనరసింహస్వామిగావిరా లుజుతున్న తంగళ్ళపల్లి.దివ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించుకొని స్వామి ప్రతిష్ట జరుపుకొని ద్వితీయ బ్రహ్మోత్సవాలను నిర్వహించుకోవడం మన అందరి అదృష్ట భాగ్యం. నేటి మానవాళి అల్ప సుఖాల వెంటపాకులాడుతు శాశ్వతమైన ఆనందాన్ని దూరం చేసుకుంటున్నామని. ప్రతి మనిషి దేహానికి సుఖం. మనసుకు శాంతి. ఇహ లోకంలో ఆనందం. పరలోకంలో మోక్షం అవసరం. ఇవి కలగాలంటే కేవలం పరమాత్ముని ఆరాధన వలెనే ఇవి సాధ్యం. భగవంతుని నామము పలికిన వారికి. భగవంతుణ్ణి దర్శించిన వారికి. దుష్ట గ్రహలుతొలగి అష్ట ఐశ్వర్యాలు. సిద్ధిస్తాయని. ఇలాంటి .మహిమణిత్వమైన దివ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామినీ దర్శించుకోవడం అదృష్టంగా భావించాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవలయంలో. బ్రహ్మోత్సవంలో పాల్గొని సేవ చేసుకోవడం. మన ద్రవ్యాన్ని వినియోగించుకోవడం మన పూర్వజన్మసుకృతమనిఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారుఇట్టి బ్రహ్మోత్సవాల్లో. ఆలయ కమిటీ సభ్యులు. అందరూ పాల్గొని బ్రహ్మోత్సవాల్లో జరుగుతున్న వసతులు పరిశీలించి బ్రహ్మోత్సవానికి వచ్చే భక్తులకు ప్రజలకువారికి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా అన్ని కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ల పూజారులు గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వారు విద్యార్థిని విద్యార్థులు ఇట్టి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు
