India Joins Elite Defence Test Club
విజయవంతంగా హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్.. ఎలైట్ క్లబ్లో భారత్
యుద్ధ సమయంలో భారత యుద్ధ విమాన పైలట్లు ఇకపై ఆకాశంలో ఎంత ఎత్తుకెళ్లినా వారి ప్రాణాలకి ఢోకా లేదు. ఈ సాంకేతిక కోసం ఇప్పటి వరకూ విదేశాలపై ఆధారపడిన భారత్.. ఇక స్వయంగా తన పైలట్లను రక్షించుకోగలదు. దీనికి సంబంధించి చేసిన టెస్ట్ విజయవంతమైంది.
రక్షణ సాంకేతికతల్లో భారతదేశం మరో మైలురాయిని అధిగమించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్‌పై హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది.
