బోయ్ట్సోవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో.. పూర్తిగా ఫుట్‌బాల్ గేర్‌లో ఉన్న ఆటగాళ్లు కనిపిస్తారు. అయితే సాధారణ దుస్తులు కాకుండా వీరి వెనుక పారాషూట్ బ్యాగులు కనిపిస్తాయి. వేల అడుగుల ఎత్తులో తేలుతూ పరుగులు, టాకిల్స్, గోల్స్ అన్నీ సాధారణంగా భూమిపై ఆడినట్టే ఆడేశారు. పైన ఓ విమానం చుట్టూ తిరుగుతూ ఈ అద్భుత దృశ్యాలను కెమెరాలో బంధిస్తోంది. హాట్ ఎయిర్ బెలూన్‌కి తాళ్లతో కట్టిన చిన్న ఫీల్డ్‌పై చిన్నచిన్న బొమ్మల్లా కదులుతున్న ప్లేయర్లు… ఆకాశం నీలంగా మెరిసిపోతూ అద్భుతంగా కనిపిస్తుంది.బోయ్ట్సోవ్ ఈ సాహసాన్ని చేయడమే కాదు.. దీన్ని ప్రపంచ రికార్డుగా ప్రకటించాడు కూడా! ‘1,800 మీటర్ల ఎత్తులో ప్రపంచపు తొలి హాట్ ఎయిర్ బెలూన్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేశాం’ అని ఇన్‌స్టాలో వీడియోకి క్యాప్షన్ జత చేశాడు. ఈ వీడియో ఇప్పటికే ఇన్‌స్టాలో 44 మిలియన్ వీక్షణలు దాటేసింది. ఎక్స్‌లో కూడా క్లిప్స్ల వర్షం కురుస్తూనే ఉంది.బోయ్ట్సోవ్కి ఇవి కొత్తేమీ కావు. గతంలో కూడా 1,500 మీటర్ల ఎత్తులో ఏరియల్ జిమ్నాస్టుల వీడియోలు రిలీజ్ చేశాడు. జూన్‌లో పోస్ట్ చేసిన ఓ స్టంట్ కూడా లక్షల వీక్షణలు సాధించింది. బెలూన్లపై బాక్సింగ్, టేబుల్ టెన్నిస్ ఇలా ఎన్నో క్రీడలను కూడా అతను ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్‌గా మార్చేశాడు. కానీ… ఈ ‘ఆకాశ ఫుట్‌బాల్ మ్యాచ్’ మాత్రం నెటిజన్ల ఊహలకు అందని విజువల్. గాల్లో రొనాల్డో స్టైల్ ‘సియూ’ సెలబ్రేషన్ కూడా దీనిని మరింత వైరల్ చేసింది. ఈ హై-ఆల్టిట్యూడ్ ఫుట్‌బాల్ నిజంగానే ట్రెండ్ అవుతుందో లేదో తెలియదు గానీ… బోయ్ట్సోవ్ మాత్రం ప్రపంచాన్ని తిరిగి పైకి చూసేలా మరోసారి చేశాడంతే!