Tribute to Photography Guru Mallaiah Sir
ఫోటోగ్రఫీకి దీపస్తంభం… మల్లయ్య సార్కు భావపూర్వక నివాళి
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ–కేసముద్రం ప్రాంతాల్లో అనేకమంది ఫోటోగ్రాఫర్ల జీవితాలను వెలిగించిన గురువు మల్లయ్య సార్ ఇక లేరు… నిన్న సాయంత్రం అనారోగ్యంతో ఆయన పరమపదించారు. వరంగల్లోని వారి నివాసంలో మల్లయ్య సార్ మృతదేహానికి పూలమాలలు వేసి ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షులు బిర్రు వేణు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు దొనికెన్న రాజేందర్, వెంకన్న, సారంగపాణి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.
కెమెరా పట్టుకోవడం నుంచి క్షణాలను కళగా మార్చే నైపుణ్యాన్ని నేర్పిన కరుణామూర్తి మల్లయ్య. ఎన్నో కుటుంబాలకు జీవనాధారంగా నిలిచి, శిష్యులకు మార్గదర్శకుడై, సహనంతో–స్నేహంతో వృత్తికి కొత్త అర్ధమిచ్చిన మనిషి. ఆయన మాటల్లో ఉన్న మృదుత్వం… బోధనలో ఉన్న నిజాయితీ… చూపులో ఉన్న ప్రేమ ఇప్పటికీ శిష్యుల హృదయాలను తడిపేస్తున్నాయి.
“మాస్టర్ చూపిన దారి లేకపోతే ఈరోజు మేమెక్కడ ఉండేవారమో తెలియదు” అంటూ పలువురు శిష్యులు కంటతడి పెట్టుకున్నారు.
మల్లయ్య సార్ వెళ్లిపోయినా… ఆయన నేర్పిన విలువలు, వృత్తి పట్ల ఉన్న నిబద్ధత, శ్రమ పట్ల ఉన్న గౌరవం తరతరాలకు మార్గదర్శక దీపంగా నిలిచిపోతుంది.
ఆ మహనీయుని ఆత్మకు శ్రద్ధాంజలి. ఘట్టించిన శిష్య బృందం.
