అసలు దొంగలు దొరికేశారు?
ఆరేళ్ల ‘‘నేటిధాత్రి’’ పోరాటం ఫలించింది కార్మికుల ఇళ్ల కల నెరవేర నుంది.

సినీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిన ‘‘రేవంత్’’
`పదేళ్లు సినీ కార్మికులను పక్కన పెట్టిన ‘‘బిఆర్ఎస్’’.

`రెండేళ్లలో సినీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిన కాంగ్రెస్.
`తిన్నదెవరో తేలింది… మొత్తం కక్కించండి!

`దొంగలు దొంగలు కలిసి కార్మికుల సొమ్ము పంచుకుతిన్నారు?
`సేవ ముసుగులో సర్వం స్వాహా చేశారు!
`కార్మికుల సొమ్ము నైవేద్యం చేసుకున్నారు?
`పెద్దమనుషులుగా చెలామణి అయిన కొందరు పగటి వేషాగాళ్లు?
`వీర నాయుడు మొత్తం చెప్పేశాడు..గుట్టంతా విప్పేశాడు.
`తినాల్సిందంతా తిన్న దొంగలు.
`ఇప్పటి పాలక మండలి మీద తోసేసి తప్పుకున్నారు.
`కొంతమందిని రెచ్చగొట్టి సమస్యను పక్కదారి పట్టించి ఇంత కాలం తప్పించుకున్నారు.
`ఇక దారులన్నీ మూసుకుపోయాయి.
`తిన్నది కక్కించడమే తరువాయి.
`సీఎం రేవంత్ ఒక్కొక్కటిగా మ్యానిఫెస్టో అంశాలు పూర్తి చేస్తున్నారు
`ఇక చిత్రపురి కార్మికులకు మంచి రోజులే ఇళ్ల కల త్వరలో నెరవేర నుంది.
`సేవ అనే ముసుగేసుకున్న అవినీతి చీడపురుగులు.
`సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టో పాయింట్ 34 లో పెట్టిన విధంగా చిత్రపురి లో జరిగిన అవినీతి ను బట్టబయలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
`51 ఎంక్వయిరీ రిపోర్ట్ ఆధారంగా 60 సర్‌చార్జ్ ఆఫీసర్ రోజారాణి ని వేసి చిత్రపురి లో కాంట్రాక్టర్స్ వద్ద నుండి ఎంత ఎంత తిన్నారో వివరించిన ఎంక్వయిరీ రిపోర్ట్..త్వరలో చిత్రపురి అవినీతి పుట్ట పగలనంది.
`తిన్న దొంగల పేర్లు బైటకొచ్చాయి?
`సొమ్ము తిన్న గజదొంగలు?
`ఇప్పుడు తిట్లు తింటున్నది అమాయకులు.
`పెయిడ్ ఆర్టిస్టులు బాగోతం ఇక చెల్లదు
`ఇప్పటి పాలక వర్గం మీద బురద చళ్ళితే కుదరదు.
`అంతా తేటతేల్లమై పోయింది.
హైదరాబాద్, నేటిధాత్రి:
నేటిధాత్రి ఒక యజ్ఞం మొదలు పెట్టిందంటే అది ఫల ప్రదం కవాల్సిందే. దాని ఫలాలు ప్రజలకు దక్కాల్సిందే. అలాంటి విజయాల పరంపరలో మరో అక్షర గెలుపు నేటిధాత్రి ఖాతాలో పడిరది. ఆరు సంవత్సరాలుగా అలుపెరగకుండా చిత్ర పురి కార్మికుల పక్షాన నేటిధాత్రి అక్షర పోరాటం చేస్తూ వస్తోంది. అడుగడుగునా నిజాలు నిగ్గు తేల్చుతూ వస్తోంది. జరిగిన అవినీతిని ప్రపంచానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ అవినీతి పరులను ప్రభుత్వం నోటీసులు అందించేదాకా వచ్చింది. కార్మికుల సొమ్మను తిన్న వారి చేత కక్కించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. జరిగిన దొంగతనం ఎప్పటికైనా బైట పడుతుంది. దొంగలెవరో తేలుతుంది. నిజం నిగ్గుతేలుతుంది. ఇప్పుడు అదే జరిగింది. చిత్రపురిలో జరిగిన అవినీతిపై ఇంత కాలం కార్మికులు పోరాటం చేశారు. ఇంత కాలం కార్మికులను మోసం చేస్తూ, వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ, మొత్తం సమాజాన్ని మభ్యపెడుతూ, నమ్మిన వారిని మోసం చేస్తూ వచ్చిన వారి బండారం బైట పడిరది. చిత్రపురి సొమ్ము ఎవరెవరు? ఎంత పంచుకున్నారు? ఎంత తిన్నారు? అనేది తేలింది. సినీ పెద్దలుగా చెలామణి అయిన పెద్దలే గద్దలై, రాబంధులై కార్మికుల సొమ్ముతిన్నారు. పైకి నీతి వచనాలు వల్లిస్తూ, మేలు చేస్తున్నామని చెప్పికార్మికుల సొమ్ము మేసేశారు. ఆ దొంగల బండారం ఇప్పుడు బైట పడిరది. వారి నుంచి తిన్నదంతా కక్కించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కూడా మళ్లీ మాయ చేయాలని, తప్పించుకోవాలని కూడా ఆ దొంగలంతా చూస్తే అవకాశం వుంది. ప్రభుత్వం వారిని ఉపేక్షించకూడదు. వారి పట్ల ఉదాసీనత ప్రదిర్శించొద్దు. కాలయాపన అసలే చేయొద్దు. ఎవరి పైరవీలను పట్టించుకోవద్దు. ఇప్పటికే పెద్దలను కాపాడుతున్న గద్దలు రంగంలోకి దిగడానికి సిద్దంగా వున్నాయి. తెరచాటున తమ ప్రయత్నాలు మొదలు పెట్టేశాయి. కార్మికుల కోసం ఎలాంటి సంబంధం లేని నేటిధాత్రి దినపత్రిక ఆరేడేళ్లుగా అక్షర పోరాటం చేస్తోంది. అలాంటిది కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సినీ పెద్దలు వాళ్ల సొమ్ము తినడానికి మనసెలా ఒప్పింది. పియ్యి తినడం అలవాటైన వాళ్లకు తమ, తర అనే బేధం వుండదు. ఎవరి సొమ్మైనా తింటారు. ఎంతైనా తింటారు. అందిన కాడికే కాదు, అందుకొని కూడా తింటారు. ఎంతటి నీచానికైనా దిగజారుతారు. చిత్రపురిలో అదే జరిగింది. అలాగే కార్మికుల సొమ్మ మాయమైంది. కష్టపడి కార్మికులు పెట్టుకున్న సొమ్ము సినీ గద్దల కోసం హరతి కర్పూరమైంది. ఇంత కాలానికి గద్దల గుట్టంతా బైటకు వచ్చింది. సినీ మాయా జగత్తులో మహా మాయగాళ్ల బండారం వెలుగు చూసింది. లెక్కల దందా బైట పడిరది. ఒక్కసారి ఆ వివరాలు చూస్తే ఈ దొంగలంతా కలిసి వీర నాయుడు అనే వ్యక్తిని ముందు పెట్టి ఎలా నాటకం ఆడారో..ఎంతెంత తిన్నారో కూడా తెలుస్తోంది. బొంగడాల వీర నాయుడు అనే వ్యక్తి డిప్యూటీ రిజిస్ట్రార్ ఆప్ కో ఆపరేటివ్ సొసైటీ గొల్కొండ రోజారాణికి రాసిన లెటర్లో వివరాలన్నీ వెల్లడిరచారు. తనను ముందుపెట్టి ఎవరెవరు ఎంత తిన్నారు? అనేది పూస గుచ్చినట్లు వివరించారు. అతనితోపాటు ఓబులేసు అనే వ్యక్తి చెప్పిన వివరాలు కూడ వున్నాయి. ఓబులేసును ముందుపెట్టి అప్పటి అద్యక్షుడు కొమరవెంకటేశ్, సభ్యుడు మహానంద రెడ్డి , వినోద్ బాలతో ముగ్గురూ కలిసి రూ కలిసి రూ.30 కోట్ల కాంటాక్టుపనిని రూ.45 కోట్లుగా లెక్క చెప్పి, సుమారు 15 కోట్ల రూపాయలు తిన్నట్లు ఓబులేసు చెప్పడం జరిగింది. ఒక్కసారి మూలాల్లోకి వెళ్తే వీర నాయుడు పేరు మీద యువర్స్ కన్ స్ట్రక్షన్ పేరుతో కంపనీ రిజిస్ట్రేషన్ చేయించారు. చిత్రపురి అకౌంటెంట్‌గా వున్న బ్రహ్మానందరెడ్డి చిత్ర పురి కమిటీ సభ్యులతో కలిసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 7.5 కోట్లు కేటాయించి, అందులో నుంచి బ్రహ్మానంద రెడ్డ 80లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా తమ సొంత అవసరాల కోసం కోసం కంపనీ నుంచి షాపింగ్ కాంపెక్స్‌లో రూ.80లక్షలతోపాటు బ్రహానందరెడ్డి మరో 1,60,00,000 తీసుకున్నారు అని తేలింది. అప్పటి అధ్యక్షుడు కొమర వెంకటేశ్ ఏకంగా ఒకే సారి 3.5కోట్లు తీసుకున్నారు. మూడో వ్యక్తి అయిన వినోద్ బాల 1,80,00,000 తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రపురి సొసైటీ చైర్మన్‌గా వున్నప్పటి వల్లభనేని అనిల్ అనే వ్యక్తి సొసైటీ సొమ్ము రూ. 60లక్షలు తీసుకున్నట్లు లెక్కలు సమాచారం. సినీ పెద్దగా చెలమణిలో వుంటూ కార్మిక పక్ష పాతిగా తనను తాను కీర్తించుకొనే రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు రూ.40లక్షలు తిన్నట్లు తెలుస్తోంది. ఇక సినీ కార్మికులకు, ఆర్టిస్టుల సంక్షేమం అంటూ కొత్త కొత్త కథలు చెప్పే నటుడు కాదంబరి కిరన్‌కుమార్ రూ. 70లక్షలు వాడుకున్నారు. వీరితోపాటు రఘు బత్తుల అనే వ్యక్తి రూ.8లక్షలు, చంద్ర మదు రూ. 5లక్షలు, తీసుకున్నట్లు వీర నాయుడు లెక్కలు చెబుతున్నారు. ఇవే కాకుండా కొమరం వెంకటేశ్, వినోద్ బాల, కృష్ణమోహన్‌రెడ్డి, మహానందరెడ్డిలు కలిసి హయత్ హోటల్ నిర్మాణం పేరుతో సుమారు 8కోట్ల, 22లక్షలు తీసుకునట్లు వీరనాయుడు చెప్పడం జరిగింది. ఇందులో ఓ ప్రభుత్వాధికారి అయిన సత్యనారాయణ రెడ్డికి కూడా రూ. 50లక్షలు చెల్లించినట్లు వీరనాయుడు చెప్పడం జరిగింది. ఐవిఆర్‌ఎల్ కృష్ణారెడ్డి అనే వ్యక్తికి మేనేజర్ మహేందర్ రెడ్డి అకౌంట్ నుంచి రూ.65లక్షలు చెల్లించినట్లు కూడా తెలుస్తోంది. ఓ కల్యాణ్ అనే నటుడికి రూ.50లక్షలు కొమర వెంకటేశ్ ఇప్పించారు. ఇలా లెక్కలన్నీ ఇచ్చిన సొమ్ము వి వరాలు ప్రభుత్వానికి అందించారు. దాంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. సిఎం. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. జిరిగిన అవకతవకలపై దృష్టిపెట్టారు. గతంలోనే దీనిపై ఓ కమిటీ వేశారు. మొత్తం మీద చిత్రపురి ప్రక్షాళనతోపాటు, ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హమీలు నెరవేర్చేందుకు సిద్దమయ్యారు. అంతకన్నాముందుగా చిత్రపురి సొమ్మును పక్కదారి పట్టించి మింగిన దొంగల గుట్ట రట్టు చేసి, వారి నుంచి తిన్నదంతా కక్కించే పని మొదలుపెట్టారు. ఇప్పటిదాకా కార్మికుల సొమ్ము అప్పనంగా తిన్న వారికి అన్ని దారులు మూసుకుపోయాయి. తిన్న సొమ్మంతా కక్కాల్సిన సమయం వచ్చింది. పదేళ్లపాటు బిఆర్ఎస్పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ, కార్మికుల గోడు అప్పటి నాయకులు వినకుండా చేశారు. అప్పటి పాలకపక్ష నాయకులతో సఖ్యతగా మెలిగారు. ఇలా చిత్ర పురిసొమ్ము తిన్న దొంగలు అప్పటి బిఆర్ఎస్ నాయకులకు ఏం ఇచ్చారు? ఎవరెవరికి ఎంతెంత ముట్ట చెప్పారన్నది కూడా ఇప్పుడు తేలుతుంది. ఈ దొంగలంతాఎంత తిన్నారు. అప్పటి నాయకులకు ఎంత పంచారు? అనేది కూడా తేలితే అందిరి బాగోతాలు బైట పడతాయి. ఆ సొమ్మంతా ప్రభుత్వం వీలైనంత తొందరగా వసూలు చేస్తే కార్మికుల కష్టం తీరుతుంది. వారి కల నెరవేరుతుంది. కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలన్న కృత సంకల్సంతో సిఎం. రేవంత్ రెడ్డి వున్నారు. కార్మికులకు న్యాయం చేయలన్న సంకల్పంతో వున్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నీ గమనిస్తూ వస్తున్నారు. ఆ లెక్కలన్నీ బైటకు తీయించారు. ఇప్పుడు అసలుదోషులు, దొంగలు తేలిపోయారు. వారు తిన్నదానిపై కూడా లెక్కలు తేలాయి. పదేళ్ల తర్వాత కార్మికులకు న్యాయం జరగనున్నది. కార్మికుల దశాబ్ధాల కల నెరవేరనున్నది. అతి త్వరలోనే ఆ కార్మికులకు సొంత ఇండ్లు నిర్మాణమయ్యే కార్యక్రమం మొదలౌతుంది. గత ఆరు సంవత్సరాల క్రితం నుంచి నేటిదాత్రి చిత్రపురిలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై అక్షర పోరాటం సాగిస్తూనే వుంది. కార్మికులు వచ్చిన తమ గోడును వెళ్లబోసుకున్న తొలి రోజు నుంచి కార్మికుల పక్షనా పోరాటం చేస్తూనే వుంది. ప్రతి సందర్భంలోనూ కార్మికులకుఅండగా వుంటేనే వస్తుంది. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా నేటి దాత్రి స్పందిస్తూనే వస్తోంది. కార్మికుల సంక్షేమం కోసం, వారి భవిష్యతు కోసం, వారి సొంతింటి కల నెరవేరాలన్న ఆశయం కోసం కొన్ని వందల సార్లు చిత్రపురిలో జరిగిన అన్యాయాలను ప్రశ్నిస్తూనే వస్తోంది. అడుగడుగునా జరిగిన అక్రమాలను వెలుగులోకి తెస్తూనే వచ్చింది. నేటిద్రాత్రి మూలంగా అనేక అక్రమాలు ఆగిపోయాయని చెప్పడానికి కూడా ఎంతో సంతోషిస్తున్నాము. జరిగిన అక్రమాలన్నీ నేటిదాత్రి రంగంలోకి దిగడానికి ముందు జరిగిన అవినీతి కార్యక్రమాలు. ఎప్పుడైతే నేటిధాత్రి డేగ కన్నుతో చిత్రపురిలో అక్రమాలు జరగకుండా నిఘా పెట్టిందో అప్పటి నుంచి ఆ గద్దలు చిత్రపురిలో వాలాలన్నా, అటు వైపు చూడాలన్నా భయపడేవారు. అక్రమంగా నిర్మాణం సాగించిన రోహౌజ్‌లను కూల్చేదాకా వదిలిపెట్టలేదు. ఇప్పుడు కార్మికుల సొమ్ము వసూలు చేసే దాకా నేటిధాత్రి తన యుద్దం ఆపలేదు. కార్మికులకు విజయం అంది ంచేదాకా అక్షర పో రాటంలో అలిసిపోలేదు. ఆగిపోలేదు. అదే నేటిధాత్రి నిబద్దతకునిదర్శనం. కార్మికుల పక్షాన విజయం.
