Congress Gains New Leaders
బిజెపి, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిక.
#కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు.
#ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి అందిస్తున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోర్తాల మనోహర్ రావు, బిజెపి గ్రామ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి చెట్టుపల్లి విజేందర్, మర్రి నాగరాజు మరి కొంతమంది సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దొంతి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు జంగిలి మోహన్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘుపతిరావు, బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దూరి తిరుపతిరావు, సీనియర్ నాయకుడు తేజావత్ సమ్మయ్య నాయక్, నాయకులు దూడాల సుమన్, చిట్యాల సురేష్, భూక్య భాస్కర్, మూడు స్వామి, రమేష్, పార్టీలో చేరిన వారు మేడిపల్లి ప్రవీణ్, కాని గంటి రాజు, అశోక్, దూడాల శ్రీనివాస్, చిట్యాల హరికోటి, తదితరులు ఉన్నారు.
