Lok Sabha Adjourned Amid Opposition Protests
లోక్‌సభ ప్రారంభం.. వెంటనే మధ్యాహ్నంకి వాయిదా
విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు.
విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11.00 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలోని సభ్యులు తమ ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. దాంతో విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓంబిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలకు విపక్షాలు సహకరించాలని సూచించారు. కానీ ముందు సమస్యలపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభను మధ్యాహ్నాంకు స్పీకర్ వాయిదా వేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో బాంబు పేలుళ్లు, ఎస్ఐఆర్ (SIR), రైతుల సమస్యలు, ఢిల్లీలో కాలుష్యంపై సభలో చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ముందు ప్రశ్నోత్తరాలు చేపట్టాలని.. ఆ తర్వాత చర్చకు సిద్ధమంటూ స్పీకర్ స్పష్టం చేశారు. అందుకు విపక్ష సభ్యులు సమేమీరా అనడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సభను మధ్యాహ్నాంకు వాయిదా వేశారు.
మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి ప్రతిపక్షాలు బయటకు రాలేదంటూ ప్రధాని మోదీ చేసి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. పార్లమెంట్లో ప్రజాసమస్యలు లేవనెత్తడం డ్రామా కాదని ఆమె పేర్కొన్నారు. SIRపై విమర్శకుల నోరు మూయిస్తున్నారంటూ కేంద్రంపై ప్రియాంకాగాంధీ మండిపడ్డారు.
