Winter Foods That Keep You Warm
చలి నుంచి రక్షణనిచ్చే వంటకాలేంటో తెలుసుకుందామా…
సాధారణంగా లడ్డూ అనగానే నోరూరుతుంది. అయితే అన్ని లడ్డూలు తియ్యగా ఉంటాయని అనుకుంటే పొరపాటే. దిల్లీలో ప్రసిద్ధిచెందిన ‘రామ్ లడ్డూ’లో ఉన్నదంతా కారమే. శీతాకాలం వచ్చిందంటే దేశ రాజధాని దిల్లీలో చలిని తట్టుకోవడం చాలా కష్టం.
చేదు లేకుండా…
గుజరాతీయులు భోజనప్రియులు అన్నది తెలిసిందే. శీతాకాలంలో గుజరాత్లో ప్రత్యేకంగా కనిపించే వంటకం ‘మేతీ నూ పాక్’. దక్షిణ భారత మైసూర్ పాక్ లాంటిదే అని… పేరును బట్టే అర్థం అవుతోంది కదూ. అయితే మెంతులతో తీపి వంటకం ఏమిటన్నదే పెద్ద ప్రశ్న. మెంతిపొడి, నెయ్యి, చక్కెర లేదా బెల్లంతో ఈ వంటకాన్ని తయారుచేస్తారు. ఇంకా గోధుమ పిండి, శనగ పిండి, మినప్పిండితో పాటు గోంద్, వివిధ రకాల డ్రైఫ్రూట్స్‌ను చేర్చి మేతీ నూ పాక్‌ను తయారు చేస్తారు. ఇలా వివిధ రకాల పదార్థాలు మెంతిలోని చేదును తగ్గిస్తాయి. ఈ స్వీట్‌ను తినడం వల్ల త్వరితగతిన వేడి, శక్తి చేకూరుతుంది. రోగనిరోధకత పెరుగుతుంది. శరీరాన్ని రోజంతా వెచ్చగా ఉంచుతుంది. కీళ్ల నొప్పులూ, జీర్ణకోశ ఇబ్బందులూ తగ్గుతాయి.
