Record 9.7 Lakh Applications for 935 Posts in Bihar
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. 935 పోస్టులకు 9.7 లక్షల దరఖాస్తులు
ప్రభుత్వ ఉద్యోగాలు ఏ స్థాయిలో పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనేక సార్లు రుజువు కాగా.. తాజాగా బిహార్ లో మరోసారి నిరూపితమైంది. ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 935 పోస్టులకు 9.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం(Govt job) సాధించడం ఓ లక్ష్యంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వ జాబ్స్ కు సంబంధించి నోటిఫికేషన్ పడిందంటే చాలు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి. కొన్ని సార్లు చిన్న పోస్టులకు సైతం తీవ్రంగా పోటీ ఉంటుంది. పలు సందర్భాల్లో పదుల సంఖ్యలో పోస్టులకు కూడా లక్షల్లో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అలాంటి ఘటనలు ఎన్నో జరగ్గా.. తాజాగా బిహార్(Bihar)లో కూడా కనిపించింది. 935 పోస్టులకు 9.7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇవి ఆ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి దరఖాస్తులు కావడం గమన్హారం.
AEDO జీతం, ఖాళీ వివరాలు:
ఈ పోస్టులకు లెవల్-5 పే స్కేల్ (రూ. 29,200) ఉంటుంది. మొత్తం 935 ఖాళీలలో, 319 మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ పోస్టులలో రాష్ట్ర స్వాతంత్ర్య సమరయోధుల రిజర్వ్డ్ మనవళ్లు , మనవరాలు, దృష్టి లోపం ఉన్నవారు (VI), చెవిటివారు, మూగవారు (DD), లోకోమోటర్ వైకల్యం (LD), మానసిక రుగ్మత (PD) వంటి వైకల్యాలున్ వారికి అవకాశాలు కూడా ఉన్నాయి.
కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు:
- జనరల్ కేటగిరీ: 374
- ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS): 93
- షెడ్యూల్డ్ కులం (SC): 150
- షెడ్యూల్డ్ తెగ (ST): 10
- అత్యంత వెనుకబడిన తరగతులు (EBC): 168
- వెనుకబడిన తరగతులు (BC): 112
- BC మహిళలు: 28
ఇవి కూడా చదవండి
