Tribute to Mahatma Phule
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి
పరకాల,నేటిధాత్రి
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని పరకాల మున్సిపల్ పరిధిలోని పెద్దరాజీపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ సంపత్,శ్రీను ఆధ్వర్యంలో పూలమాలలువేసి,ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ రాష్ట్ర కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్.మడికొండ శ్రీను,ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్,కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు,బ్లాక్.కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మడికొండ సంపత్ కుమార్,సమన్వయ కమిటీ సభ్యులు చిన్నాల గోనాథ్,ఎస్టీ సెల్ కమిటీ పరకాల నియోజకవర్గం కన్వీనర్ పాలకుర్తి శ్రీను,షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ గూడెల్లి సదన్ కుమార్,నాయకులు పసుల రాజకుమార్,ఉడుత సంపత్, మడికొండ రామూర్తి,మంద సురేష్,బొజ్జం సాయి, మోతే పెద్ద రాజయ్య,మోతే చిన్న రాజయ్య,అల్లే రాజయ్య, అడపా బాపూరావ్,మోరే పరశు రాములు తదితరులు పాల్గొన్నారు.
