Awareness Program Against Child Marriages in Bhuvalapalli
బాల్యవివాహాల నిర్మూలనకై అవగాహన
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి సూచనల మేరకు భూపాలపల్లి మండలం ఆజాంనగర్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్ రాజేశ్వరి అధ్యక్షతన బాల్యవివాహాల పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజేశ్వరి మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, బాల్యంలో చదువుకోవాల్సిన పిల్లలకి పెళ్లిళ్లు చేస్తే బాల్యవివాహాల నిషేధ చట్ట ప్రకారం వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడునని తెలపడం జరిగింది అలాగే నేటి బాలలే రేపటి పౌరులుగా, నవ సమాజ నిర్మాణానికి నాంది కావాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ గుర్రం తిరుపతి, జెండర్ స్పెషలిస్ట్ అనూష, సఖి కౌన్సిలర్ మాధవి, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ప్రసాద్ అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు అని రాజేశ్వరి తెలిపారు
