Zahirabad
జహీరాబాద్లో వివాహిత ఆత్మహత్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలంలో భర్తతో విభేదాలు, వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. బూర్డిపాడుకు చెందిన స్యాతి(22)కి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. తరచు గొడవలు, వేధింపులతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కాశినాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
