Grand Launch of Sathya Sri Tiles on 30th
ఈనెల 30న సత్య శ్రీ టైల్స్ శానిటరీ హోల్ సేల్ షాప్ గొప్ప ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం లో ఈ నెల 30 న ఘనంగా ప్రారంభం కానున్న నిత్య శ్రీ టైల్స్ సానిటరీ హోల్ సేల్ షాప్ సందర్బంగా గురువారం పివిఆర్ ఫంక్షన్ హాల్ లో గొప్ప ప్రారంభ సమావేశం నిర్వహించి శ్రేయోభిలాషులకు, స్నేహితులకు నూతన దుస్తులు మరియు స్టైల్ వాటర్ బాటిల్ అందజేశారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణం లో జాన్సన్ కంపెనీ కి సంబందించిన వస్తువులు మంచికి మారుపేరు నాణ్యమైన వస్తువులు అందుబాటులో మన పట్టణం లో దొరకడం మన అదృష్టం అన్నారు. ప్రొప్రైటర్ యాజమాన్యం పెంట రెడ్డి నరసింహ రెడ్డి లను అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో యాజమాన్యం పెంటరెడ్డి కాంట్రాక్టర్ రాజు పాటిల్,రాయికోటి నర్సిములు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
