Civil Supplies Officers Inspect Grain Centers
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సివిల్ సప్లై అధికారులు
భూపాలపల్లి నేటిధాత్రి
గాంధీనగర్, బుద్ధారం, ఘన్పూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్కుమార్ డీఎం, సీఎస్సీ రాములు, యూడీఆర్ఐ అధికారులతో కలిసి. పరిశీలించారు
ఈ సందర్భంగా పౌర సరఫరాల అధికారి ఇన్చార్జీలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎఫ్ఏక్యూ (FAQ) ప్రమాణాల మేరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే సంబంధిత బియ్యపు మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని, కేంద్రాలలో తూకం, బిల్లింగ్, రవాణా ప్రక్రియలను పర్యవేక్షిస్తూ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా పూర్తిస్థాయిలో బాధ్యతతో పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో
ఆర్ ఐ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
